Kalyan Ram: 'ఎంతమంచివాడవురా' నుంచి సాంగ్

  • సతీశ్ వేగేశ్న నుంచి కుటుంబ కథా చిత్రం 
  •  గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  •  జనవరి 15వ తేదీన విడుదల

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంతమంచివాడవురా' రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి గోపీసుందర్ స్వరాలను అందించాడు. ఈ నెల 19వ తేదీన ఉదయం 11గంటల 9 నిమిషాలకి, 'అవునో తెలియదు .. కాదో తెలియదు' అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ మెలోడీ సాంగును శ్రేయ ఘోషల్ ఆలపించింది.

ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా, జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. టైటిల్ పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, కొత్త సంవత్సరంలో తనకి పెద్ద హిట్ ఇస్తుందని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

More Telugu News