Rakshith Shetty: వివిధ భాషల్లో విడుదల తేదీలను ఖరారు చేసుకున్న 'శ్రీమన్నారాయణ'

  • పోలీస్ ఆఫీసర్ గా రక్షిత్ శెట్టి 
  • 5 భాషల్లో భారీ స్థాయి విడుదల 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు

కన్నడలో మంచి క్రేజ్ వున్న యువ కథానాయకులలో రక్షిత్ శెట్టి ఒకరు. ఆయన తాజా చిత్రంగా సచిన్ దర్శకత్వంలో 'అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ' రూపొందింది. పోలీస్ ఆఫీసర్ గా రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాలో కథానాయికగా శాన్వి కనిపించనుంది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఆయా భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే తేదీలను తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కన్నడలో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన .. తెలుగులో జనవరి 1వ తేదీన .. తమిళ - మలయాళ భాషల్లో జనవరి 3వ తేదీన .. హిందీలో జనవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పుష్కర మల్లికార్జునయ్య నిర్మించిన ఈ సినిమా, రక్షిత్ శెట్టికి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

More Telugu News