Disha: క్రమంగా కుళ్లిపోతున్న దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు.. పోలీసుల్లో టెన్షన్!

  • గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు
  • ఎంబాంబింగ్ చేస్తే రీపోస్టుమార్టానికి అవకాశం నిల్
  • తర్జనభర్జన పడుతున్న పోలీసులు

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. దీంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో  పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. నిజానికి ఈ నెల 13 వరకే భద్రపరచాలని చెప్పినప్పటికీ స్పష్టత లేకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

ఎంబాంబింగ్ చేస్తే మరో రెండువారాలపాటు భద్రపరిచే అవకాశం ఉన్నప్పటికీ రీపోస్టుమార్టానికి అవకాశం ఉండదు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు, అతి శీతల ప్రదేశంలో ఉంచినప్పటికీ మరో వారం వరకు మృతదేహాలు చెడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో తేలేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలిసే పరిస్థితి లేదు. మృతదేహాలను ఏం చేయాలో తెలియక పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే, ఢిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News