Ayodhya: అయోధ్యలో ఆకాశమంత రామమందిరం... మరో నాలుగు నెలల్లో నిర్మాణం ప్రారంభం: అమిత్ షా

  • కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించినా ఆలయం నిర్మించి తీరుతామన్న షా
  • సుప్రీం కూడా తీర్పు ఇచ్చిందని స్పష్టీకరణ
  • వందేళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడి

దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు ఇటీవలే తెరదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినా అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.

 మరో నాలుగు నెలల్లోనే నిర్మాణం ప్రారంభమవుతుందని, అయోధ్యలో ఆకాశమంత ఎత్తున రామాలయం నిర్మితమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో మహత్తరమైన ఆలయం నిర్మించాలని ప్రజలు గత వందేళ్లుగా డిమాండ్ చేస్తున్నారని, సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు వెలువరించిందని అమిత్ షా తెలిపారు. ఝార్ఖండ్ లోని పాకూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News