India: సాయుధ దళాలకు, అమరవీరుల నిలువెత్తు స్ఫూర్తికి శిరసు వంచి వందనం చేస్తున్నా: నారా లోకేశ్

  • 1971లో భారత్, పాక్ యుద్ధం
  • డిసెంబరు 16న పాక్ ఓటమి
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్

బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య భారీస్థాయిలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్, బంగ్లాదేశ్ సాయుధ బలగాలు కలసికట్టుగా పాకిస్థాన్ సేనలపై కదంతొక్కాయి. డిసెంబరు 16న పాక్ ఓటమితో ఈ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో అనేకమంది భారత జవాన్లు అమరులయ్యారు. నేటికి ఆ యుద్ధం జరిగి 48 ఏళ్లు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

"48 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఇండో-పాక్ యుద్ధంలో భారత్ గెలిచింది. సాయుధ దళాల తెగువ, శౌర్యం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితమే ఆ యుద్ధంలో మనకు విజయం లభించింది. ఈ విజయ దినోత్సవం నాడు ఎవరికీ తలొగ్గని భారత సైన్యం స్ఫూర్తికి శిరసు వంచి వందనం చేస్తున్నా" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News