Rajanala: రాజనాలకి తొలి అవకాశం అలా దక్కిందట

  • రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన రాజనాల
  • సెలవు రోజుల్లో సినిమాల్లో ప్రయత్నాలు 
  • తొలి అవకాశం ఇచ్చిన హెచ్ ఎమ్ రెడ్డి

తెలుగు తెరపై ప్రతినాయకుడిగా ఒక వెలుగు వెలిగిన నటుడు రాజనాల. విలనిజంపై తనదైన ముద్రవేసిన ఆయన, అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి రాజనాలను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, "రాజనాల పూర్తి పేరు రాజనాల కల్లయ్య .. నెల్లూరులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. సెలవు రోజుల్లో మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు.

అలా ఆయన దర్శక నిర్మాత అయిన హెచ్ ఎమ్ రెడ్డిగారిని కలుసుకుని, తనకి గల నాటకానుభవాన్ని గురించి చెప్పి .. తన ఫొటో ఇచ్చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత హెచ్ ఎమ్ రెడ్డిగారు 'ప్రతిజ్ఞ' సినిమా తీయడానికి సన్నాహాలు మొదలెట్టారు. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా రాజనాల కల్లయ్య అయితే కరెక్ట్ గా ఉంటాడని భావించి పిలిపించారు. స్క్రీన్ నేమ్ 'రాజనాల' అయితేనే బాగుంటుందని అంతవరకే సెట్ చేశారు. అప్పటి నుంచి రాజనాల కల్లయ్య .. రాజనాల పేరుతోనే తన కెరియర్ ను కొనసాగించారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News