Irfan Pathan: జరుగుతున్న ఘటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నా: ఇర్ఫాన్ పఠాన్

  • జామియా యూనివర్శిటీలో నెలకొన్న పరిస్థితులపై ఇర్ఫాన్ ఆందోళన
  • పొలిటికల్ గేమ్ అనేది మన దేశంలో ఎప్పటికీ ఉంటుంది
  • కానీ, విద్యార్థుల గురించి యావత్ దేశం కలవరపడుతోంది

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలో, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ యూనివర్శిటీలో చోటుచేసుకున్న హింసను తక్షణమే నియంత్రించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరోవైపు, యూనివర్శిటీలో జరుగుతున్న ఘటనలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నానని తెలిపాడు. పొలిటికల్ గేమ్ అనేది మన దేశంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని... కానీ, జామియా విద్యార్థుల గురించి తనతో పాటు యావత్ దేశం కలవరపడుతోందని ట్వీట్ చేశాడు.

యూనివర్శిటీలో నెలకొన్న హింస నేపథ్యంలో దాదాపు 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున వారందరినీ విడుదల చేశారు.

More Telugu News