Venkimama: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పాయల్ రాజ్‌పుత్

  • ‘వెంకీమామ’తో విజయాన్ని అందుకున్న పాయల్
  • ఆదివారం శ్రీవారి సుప్రభాత సేవలో నటి
  • సెల్ఫీలకు ఎగబడిన భక్తులు
‘వెంకీమామ’ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న నటి పాయల్ రాజ్‌పుత్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంది. మూలవర్లను దర్శించుకుంది. రాత్రి భోజనం కోసం ఆమె శ్రీవత్స అన్నమయ్య హోటల్‌కు వెళ్లగా, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ సభ్యుడు పెంచలయ్య  శాలువా కప్పి సన్మానించారు. కాగా, ఆలయం వెలుపల పాయల్‌ను గుర్తుపట్టిన భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Venkimama
Payal Rajput
Tirumala

More Telugu News