Telangana: రేపటి నుంచి అమల్లోకి రానున్న విజయడైరీ పెరిగిన పాల ధరలు

  • లీటర్ ప్యాకెట్ కు రూ.2 చొప్పున పెంపు
  • వెండర్ మార్జిన్ ప్రతి లీటర్ పై 25 పైసలు పెంపు
  • ఓ ప్రకటనలో టీఎస్ డీడీసీఎఫ్  

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ విజయా డైరీ పాల ధరలు మరోమారు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్ డీడీసీఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. లీటర్ ప్యాకెట్ కు రెండు రూపాయల చొప్పున పెంచినట్టు పేర్కొంది. అయితే, స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. రేపటి నుంచి వెండర్ మార్జిన్ ప్రతి లీటర్ పై 25 పైసలుగా, బేస్ మార్జిన్ ధర లీటర్ కు రూ.3.25 పెంచుతున్నట్టు వివరించింది.  

ఇదిలా ఉండగా, పెంచిన ధరలను వెంటను ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలు అని అన్నారు. పాల ధరలు పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలు కొనుగోలు చేయడం కష్టమవుతుందని అన్నారు.

More Telugu News