YSRCP: నేను బీజేపీలో చేరాల్సిన అవసరం లేదు: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

  • వైసీపీలో తనకు సముచిత గౌరవం ఉంది
  • జగన్మోహన్ రెడ్డికి నాకు సాన్నిహిత్యం ఉంది
  • గతంలో బీజేపీలో నాలుగేళ్లు ఉన్నాను

ఉన్న పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ తనపై వస్తున్న వదంతులపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీలో చేరాల్సిన అవసరం తనకు లేదని, వైసీపీలో తనకు సముచిత గౌరవం ఉందని, జగన్మోహన్ రెడ్డికి తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పారు. గతంలో తాను బీజేపీలో నాలుగేళ్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచిన మీకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ సిఫారసు చేశారు కనుకనే తనకు ఈ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.

‘రాజు గారు ఎలా ఉన్నారు?’ అంటూ ప్రధాని మోదీ మిమ్మల్ని పలకరించేంతటి సాన్నిహిత్యానికి కారణం? అనే ప్రశ్నకు రఘురామ కృష్ణంరాజు బదులిస్తూ, గతంలో మోదీని చాలాసార్లు కలిశానని, ఎదురుపడ్డప్పుడు ‘నమస్కారం’ చేస్తుంటానని చెప్పారు.

‘మీకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చే వైసీపీ నేతలు ఉన్నారా?’ అని అడగగా ఆయన చెబుతూ, ఈ విషయంలో అనుమానం ఎందుకు? జగన్ కు, తనకు మధ్య లేనిపోనివి క్రియేట్ చేయాలని చూసే ఇద్దరు ముగ్గురు ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విజ్ఞత గల నేత కనుక ఇలాంటి వాటిని నమ్మరని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News