Ys Rajshekar reddy: వాళ్ల నాన్నకు లేని స్వేచ్ఛ జగన్ కు వచ్చింది : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టు జగన్ ఉండరు
  • యంగ్ జనరేషన్ వచ్చింది.. థింకింగ్ అడ్వాన్స్ గా ఉంది
  • కాలం మారింది, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఉన్న పోలిక, తేడా ఏంటని అడిగిన ప్రశ్నకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘జనరేషన్ చేంజ్ ఉంది. ఇప్పుడు, నేను ఉన్నట్టుగా మా అబ్బాయి ఉండడు. అలాగే, రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టు ఈయన (జగన్) ఉండరు. కాలం మారింది, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, సోషల్ మీడియా.. అంటే, పబ్లిక్ లైఫ్ లో నిఘా పెరిగింది. యంగ్ జనరేషన్ వచ్చింది. థింకింగ్ అడ్వాన్స్ గా ఉంది. కానీ, బేసిక్ కోర్ సేమ్ ఉంది. ఈయన సొంతంగా పెట్టిన పార్టీ కావడంతో ఫ్రీడమ్ ఉంది. వాళ్ల నాన్న గారికి లేని స్వేచ్ఛ వచ్చింది’ అని అన్నారు.
Ys Rajshekar reddy
Ys jagan
Sajjala Ramkrishna reddy

More Telugu News