వైసీపీ ఎమ్మెల్యే రజినిపై అభ్యంతరకర పోస్టింగ్స్.. అదుపులో నిందితులు

15-12-2019 Sun 14:10
  • ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్
  • నెల్లూరుకు చెందిన యువకులుగా గుర్తింపు
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కించపరిచే విధంగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ లు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్ చేశారు. ఈ విషయమై ఆరా తీసిన చిలకలూరిపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.