Narendra Modi: గంగానదిలో విహారానికి ముందు కాలుజారి కిందపడిన నరేంద్ర మోదీ... వీడియో ఇదిగో!

  • నిన్న కాన్పూర్ కు వచ్చిన నరేంద్ర మోదీ
  • మెట్లపై కిందపడిన ప్రధాని
  • అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది
నిన్న కాన్పూర్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, గంగా నదిలో బోటుపై విహారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విహారానికి ముందు ఆయన మెట్లు ఎక్కుతూ జారి పడ్డారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు, మోదీని పట్టుకుని లేపారు. 'నమామి గంగే' ప్రాజెక్టులో భాగంగా గంగా కౌన్సిల్ సమావేశాన్ని కాన్పూర్ లో ఏర్పాటు చేయగా, దీనిలో పాల్గొనేందుకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు హాజరైన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ కాలు జారిన వీడియోను మీరూ చూడవచ్చు.
Narendra Modi
Ganga River
Namami Gange
Boat

More Telugu News