మిస్ వరల్డ్ టైటిల్ ను తృటిలో మిస్ అయిన భారత్... మూడో స్థానంలో సుమన్ రావు!
- లండన్ లో మిస్ వరల్డ్ పోటీలు
- కిరీటాన్ని దక్కించుకున్న జమైకా సుందరి టోనీ-ఆన్ సింగ్
- సెకండ్ రన్నరప్ గా నిలిచిన సుమన్ రావు
గత నెల 20వ తేదీ నుంచి ఈ పోటీలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 120 దేశాలకు చెందిన అమ్మాయిలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా, ఫైనల్స్ కు 10 మంది అర్హత సాధించారు. వీరిని పలు ప్రశ్నలు అడిగిన ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం, సమాధానాల ఆధారంగా విజేతలను ప్రకటించింది.