CBI case registered against Famous Bharathanatyam Artist Leela Samson: సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్ పర్సన్ లీలా శాంసన్ పై సీబీఐ కేసు నమోదు

  •  ఆడిటోరియం పునరుద్ధరణ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు 
  • పనుల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘించారంటూ ఆరోపణలు
  • ఫౌండేషన్ అకౌంట్స్ అధికారులపై కూడా కేసులు  

చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ కు చెందిన కూతుంబలం ఆడిటోరియం పునరుద్ధరణ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్ పర్సన్ లీలా శాంసన్, మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో ఆమె ఈ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో లీలా శాంసన్ నిబంధనలు అతిక్రమించి రూ.7.02 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ సంస్థ కార్డ్ కు అప్పగించారని రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజిలెన్స్ ప్రధానాధికారి ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో లీలా శాంసన్, ఫౌండేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి మూర్తి, అకౌంట్స్ అధికారి ఎస్.రామచంద్రన్, ఇంజినీరింగ్ అధికారి వి. శ్రీనివాసన్ తదితరులపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు వెల్లడించారు. లీలా శాంసన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాక ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుకు ఛైర్ పర్సన్ గా పనిచేశారు.

More Telugu News