Telangana: మద్య నిషేధం చేయకపోతే ముఖ్యమంత్రికి ఆడపిల్లల పాపం తగులుతుంది: బీజేపీ నేత డీకే అరుణ

  • ముగిసిన మహిళా సంకల్ప దీక్ష
  • దశల వారీగా మా ఉద్యమం కొనసాగిస్తాం
  • పక్క రాష్ట్రాలను చూసి సీఎం నేర్చుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష ముగిసింది. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, దశల వారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.

భర్తలు తాగొచ్చి భార్యలను కొట్టినా.. చంపినా, చిన్నపిల్లలు తాగుడుకు అలవాటు పడినా, దిశ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా మద్య నిషేధం చేయమని అంటే.. ‘ఆడపిల్లల పాపం తగులుతుంది ముఖ్యమంత్రికి’ అని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఏ విధంగా అమలు చేయాలన్నది పక్క  రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని సూచించారు.

More Telugu News