Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: మృతదేహాలు చెడిపోకుండా భద్రపరచాలన్న హైకోర్టు

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పిటిషన్లు
  • హైకోర్టులో విచారణ
  • సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదోపవాదాల సందర్భంగా, నిందితుల మృతదేహాలు పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జరుగుతున్న అన్ని దర్యాప్తులపైనా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇతర విచారణలు నిలిపివేయాలని ఆదేశించింది.  
Disha
Encounter
Telangana
Supreme Court
Police
High Court

More Telugu News