Andhra Universitry: వైఎస్సార్ కల ఏ విధంగా సాకారమైందో సీఎం జగన్ చూడాలి: టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని

  • ఏయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుర్నాని
  • నాడు తమ క్యాంపస్ కు వైఎస్ శంకుస్థాపన చేశారన్న సీఈఓ

విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ)లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. దీనికి విచ్చేసిన టెక్ మహీంద్ర సీఈవో గుర్నాని మాట్లాడుతూ, ఏయూలో ఒకరోజు ఉండటం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

టెక్ మహీంద్రా క్యాంపస్ కు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. నాడు వైఎస్సార్ కల ఏ విధంగా సాకారమైందో జగన్ చూడాలని అన్నారు. టెక్ మహీంద్రా క్యాంపస్ ను సందర్శించాలని ఈ సందర్భంగా జగన్ ని ఆహ్వానించారు. కృత్రిమ మేథస్సుపై సహకరించాలని ఏయూ వీసీ కోరారని, ఏయూతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News