ఆసుపత్రిలో సిద్ధరామయ్యకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప పరామర్శ

13-12-2019 Fri 12:29
  • ఆయన వెంట పలువురు మంత్రులు
  • యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
  • గుండెపోటుతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నేత

గుండెపోటుతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప పరామర్శించారు. ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనైన సిద్ధరామయ్య గుండెపోటు బారినపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు గత రాత్రి ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో  ఆసుపత్రికి సహచర మంత్రులు కొందరితో కలిసి వెళ్లిన యడ్యూరప్ప, సిద్ధరామయ్య ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.