Rishab Pant: బాలీవుడ్ హీరోయిన్ తో రిషబ్ పంత్ డేటింగ్... మూడో టీ-20కి ముందు స్టార్ హోటల్ కు!

  • గతంలో హార్దిక్ తో జతకట్టిన ఊర్వశి
  • ఇప్పుడు పంత్ తో కలిసి డిన్నర్ కు
  • పంత్ పై నెటిజన్ల విమర్శలు
వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతెలాతో కలసి ముంబైలోని ఓ స్టార్ హోటల్ కు రావడంతో, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నాన్న వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో హార్దిక్ పాండ్యాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఊర్వశి, ఇప్పుడు పంత్ తో జత కట్టిందని నెటిజన్లు అంటున్నారు.

ఇక పంత్ పై విమర్శలూ వస్తున్నాయి. ధోనీ అంతటి వాడిగా ఎదగాల్సిన పంత్, ఇటీవలి కాలంలో నిలకడ లేక, పేలవమైన షాట్లు ఆడుతూ, జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితికి చేరాడని, అందుకు ఇలాంటి డేటింగ్ లే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవలి టీ-20 సిరీస్ లో పంత్ కేవలం 18, 33 నాటౌట్, 0 పరుగులకు పరిమితమై నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
Rishab Pant
Urvasi Routela
Dating
Star Hotel

More Telugu News