She Teams: ఆరో తరగతి అమ్మాయికి 'బ్యాడ్ టచ్'.. అంకుల్ ని పట్టేసిన షీ టీమ్స్!

  • బ్యాడ్ టచ్ అని ఇప్పుడే తెలిసింది
  • వీడియోలు చూపిస్తూ తాకుతున్నాడని బాలిక ఫిర్యాదు
  • డెకాయ్ ఆపరేషన్ తో ఆట కట్టించిన పోలీసులు
చిన్నారులపై లైంగిక వేధింపులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో షీటీమ్స్‌ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం ఓ కామాంధుడిని పట్టించింది. ఇటీవల ఓ ప్రైవేట్‌ స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆరో తరగతి బాలికలకు వివరించగా, 11 ఏళ్ల బాలిక స్పందించింది. తమ పక్క ఇంట్లో ఉండే అంకుల్ చేస్తున్న పనులను చెప్పింది. అతనిది బ్యాడ్‌ టచ్‌ అని తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పింది. తాను ఇంటికి వెళ్లిన తరువాత పిలిచి, ఫోన్ లో వీడియోలు చూపించేవాడని, శరీర భాగాలను తాకేవాడని, ఇంతవరకూ ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఏడ్చింది.

వెంటనే స్పందించిన షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. గత నవంబర్ లో మొత్తం 164 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో 32,800 మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
She Teams
Hyderabad
Girls
Bad Touch
Decoy Operation
Police

More Telugu News