New Delhi: ఢిల్లీలో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వాన.. విమానాల మళ్లింపు

  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మూడు కిలోమీటర్ల మేర వాహనాల బారులు
  • జోధ్‌పూర్, జైపూర్, లక్నోలకు విమానాల మళ్లింపు
ఢిల్లీలో గత రాత్రి మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పార్లమెంట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, లోధి రోడ్, ఆర్‌కే‌పురం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు, వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోకి నీరు భారీగా చేరింది. దీంతో రన్‌వేను మూసివేసిన అధికారులు ఢిల్లీకి రావాల్సిన విమానాలను  జోథ్‌పూర్, జైపూర్, లక్నో తదితర నగరాలకు మళ్లించారు.  
New Delhi
Rain

More Telugu News