IRS Officer Jasthi Krishna Kishore suspension: ఏపీలో ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ సస్పెన్షన్

  • ఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై విచారణ
  • కిషోర్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
  • విచారణ పూర్తయ్యే వరకు కిషోర్ అమరావతి విడిచిపోవద్దని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ కు గురయ్యారు. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కిశోర్ పని చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో  ఆయనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన శాఖనుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. కిషోర్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది. ఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని వారికి సూచించింది. ఆరునెలల్లోగా విచారణ పూర్తిచేయాలని.. విచారణ పూర్తయ్యే వరకు కిషోర్ అమరావతి విడిచిపోవద్దని ఆదేశించింది.

కాగా, కృష్ణ కిషోర్ ఆంధ్రప్రదేశ్ కు డెప్యూటేషన్ పై వచ్చారు. గతంలో ఆయన అప్పటి కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా పని చేశారు.

  • Loading...

More Telugu News