Akkineni: అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థ వేడుక!

  • నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడి నిశ్చితార్థం
  • చెన్నైలో జరిగిన వేడుక
  • ఓ ఫొటో పోస్ట్ చేసిన అఖిల్
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. చెన్నైలో జరిగిన వేడుకకు నాగార్జున, అమల, నాగార్జున సోదరి నాగసుశీల, సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ తో పాటు వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉండగా, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ఈ ఫొటోలో సమంత లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘సమంత ఎక్కడ?’ అంటూ ఆరాతీశారు.
Akkineni
Nagarjuna
Venkat
Nagachaitanya

More Telugu News