Srisailam Reservoir flood water Utilization issue: గత ప్రభుత్వం రాయలసీమను ఎండ బెట్టింది: మంత్రి అనిల్

  • శ్రీశైలం రిజర్వాయర్ వరద నీటి వినియోగంపై ఏపీ శాసన మండలిలో చర్చ
  • అధికారంలోకి రాగానే.. చెరువులకు నీళ్లిచ్చామన్న మంత్రి
  • రాయల సీమలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
శ్రీశైలం రిజర్వాయర్ వరద నీటి వినియోగంపై ఏపీ శాసన మండలిలో చర్చ సాగింది. అధికార వైసీపీ సభ్యులు గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని విమర్శించారు. ఈ అంశంపై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే చెరువులకు నీళ్లిచ్చామన్నారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఇవన్నీ విస్మరించి ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారని పేర్కొన్నారు. తాము చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు.
Srisailam Reservoir flood water Utilization issue
AP Vidhan Parishad discussion
Minister Anil Response

More Telugu News