Telugudesam: మా హక్కులు హరించే అధికారం జగన్ కి ఎవరిచ్చారు?: నారా లోకేశ్

  • ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతోంది?
  • ప్రతిపక్ష సభ్యులను అగౌరవపరిచే రీతిలో ప్రవర్తిస్తారా?
  • చంద్రబాబుని సైతం అడ్డుకునే అధికారం మార్షల్స్ కు ఎవరిచ్చారు?
శాసనసభలో ప్రజాసమస్యలపై నిరసన తెలిపే తమ హక్కులను హరించే అధికారం సీఎం జగన్ కు ఎవరిచ్చారు? ప్రతిపక్షాలకు శాసనసభలో నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతోంది? అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులను అగౌరవపరిచే రీతిలో చంద్రబాబుని సైతం చేతులతో అడ్డుకునే అధికారం మార్షల్స్ కు ఎవరిచ్చారు? ప్రతిపక్ష చేతిలో కాగితాలు ఉంటే గేటు బయటే నిలబెడతారా అంటూ నిప్పులు చెరిగారు. జగన్ వ్యవహారశైలి చూస్తుంటే ప్రజా సమస్యలపై నోరెత్తకూడదన్నట్టుగా ఉందని విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో నిరసన తెలిపారని, అప్పట్లో వారికి వున్న హక్కు ఇప్పటి ప్రతిపక్షమైన తమకు ఎందుకు ఉండదని ప్రశ్నించారు.
Telugudesam
Chandrababu
Nara Lokesh
Jagan

More Telugu News