Divyansha Kaushik: తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన 'మజిలీ' భామ

  • 'మజిలీ'తో మంచి గుర్తింపు  
  • ఆశించిన స్థాయిలో రాని అవకాశాలు
  • తమిళంలో 'టక్కర్'తో పరిచయం 

దివ్యాన్ష కౌశిక్ పేరు వినగానే 'మజిలీ' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో కుర్రకారు మనసులు దోచేస్తూ చాలా సహజంగా ఆమె చేసిన నటన కళ్లముందు కదలాడుతుంది. అయితే ఆ సినిమా హిట్ సమంత ఖాతాలో పడిపోయింది. ఆ కారణంగా దివ్యాన్షను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కొంతకాలం పాటు వేచి చూసిన ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

అక్కడికి వెళ్లి చేసిన ప్రయత్నాల కారణంగానే ఆమెకి 'టక్కర్' సినిమాలో ఛాన్స్ తగిలింది. సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. అంతేకాదు కోలీవుడ్లో తాను నిలదొక్కుకుంటాననే ఆశతో ఈ అమ్మాయి ఉందట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ రెండు భాషల నుంచి ఆమెకి ఆఫర్లు పెరిగే అవకాశాలైతే వున్నాయి.

More Telugu News