Rajanikant: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కీలక వివరాలు వెల్లడించిన సోదరుడు సత్యనారాయణరావు!

  • నేడు రజనీ కాంత్ 70వ పుట్టిన రోజు
  • తమిళనాడులో ఫ్యాన్స్ వేడుకలు
  • కొత్త సంవత్సరంలో పార్టీ వివరాలను రజనీ వెల్లడిస్తారు
  • తమిళనాట అద్భుతం ఖాయమన్న సత్యనారాయణరావు
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, నేడు తన 70వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా రజనీ ఫ్యాన్స్ పండగలా తమ హీరో పుట్టినరోజును జరుపుతున్నారు. చెన్నైలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న రజనీ సోదరుడు సత్యనారాయణరావు, ఆయన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యమని, కొత్త సంవత్సరంలో తన కొత్త పార్టీ వివరాలను రజనీ స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తారని, పర్యటన కొనసాగే వివరాలను, పార్టీ సిద్ధాంతాలను ఆయనే వెల్లడిస్తారని అన్నారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుందని, తాను ఎంచుకున్న చోటు నుంచి రజనీకాంత్ పోటీకి దిగుతారని అన్నారు. రజనీ రాజకీయ ప్రవేశంతో తమిళనాడులో అద్భుతం జరుగుతుందని సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు.
Rajanikant
Politics
Birthday

More Telugu News