Kakinada: పవన్ కల్యాణ్ తో పాటు దీక్షలో కూర్చున్న నాగబాబు!

  • కాకినాడలో ఒక రోజు దీక్ష
  • మొదలైన 'రైతు సౌభాగ్య దీక్ష'
  • రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రైతుల సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తలపెట్టిన ఒకరోజు దీక్ష, కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఉదయం ప్రారంభమైంది. పవన్ దీక్షలో ఆయన సోదరుడు నాగబాబుతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్న పవన్, రైతుల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.

 ఈ  దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని రైతులు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను దీక్ష చేస్తున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గిట్టుబాటు ధరలు లభించక, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కష్టాలను, ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Kakinada
JNTU
Pawan Kalyan
Protest
Nagababu

More Telugu News