America: వాషింగ్ మెషీన్లో నక్కి.. అమెరికాకు చైనా వాసుల ప్రయాణం.. విస్తుపోయిన అధికారులు

  • కంటైనర్లలోని గృహెూపకరణాల ద్వారా అక్రమ వలస 
  • వెలుగు చూస్తున్న వాస్తవాలతో ఆశ్చర్యం
  • 11 మంది చైనీయుల రాకను గుర్తించిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికాను ఏదోలా చేరుకోవాలి... అక్కడ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి... బతుకుదెరువు ఏర్పర్చుకోవాలి... నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి...అన్న ఆకాంక్షతో ప్రాణాలకు తెగించి కొందరు అక్రమ వలసలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ కంటైనర్‌ను అమెరికా అధికారులు తనిఖీ చేయగా అందులోని పలు గృహెూపకరణాల్లో దాక్కుని ప్రయాణిస్తూ అమెరికాలోకి అడుగు పెట్టిన 11 మంది చైనీయులను గుర్తించి ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల మెక్సికో నుంచి గృహోపకరణాలతో ఓ కంటైనర్ వస్తోంది. కాలిఫోర్నియా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది సరిహద్దులో వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో మానవ అక్రమ రవాణా జరుగుతుండడం, ట్రక్కు డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో మొత్తం కంటైనర్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

పలు గృహెూపకరణాల్లో దాక్కుని చైనా దేశానికి చెందిన 11 మంది అమెరికాలోకి అడుగు పెట్టినట్టు గుర్తించారు. ఓ వ్యక్తి ఏకంగా వాషింగ్ మెషిన్లో దాక్కుని ప్రయాణిస్తుండడం చూసి విస్తుపోయారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News