Asaduddin Owaisi: జాతీయ పార్టీల కారణంగా దేశం చాలా నష్టపోయింది: అసదుద్దీన్ ఒవైసీ

  • జాతీయ పార్టీలపై ఒవైసీ విమర్శలు
  • ప్రజాస్వామ్యానికి ముప్పు జాతీయపార్టీలేనని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని ఉద్ఘాటన

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం వంటిదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ పార్టీల కారణంగానే దేశానికి నష్టం వాటిల్లిందని, జాతీయ పార్టీల వల్లే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని ఒవైసీ ఉద్ఘాటించారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా పార్లమెంటులో వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేదన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడంతోపాటు అవి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News