సీఎం కేసీఆర్ ను కలిసిన అజహరుద్దీన్, సానియా... అసద్-ఆనమ్ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం

10-12-2019 Tue 15:51
  • చాలాకాలంగా ప్రేమలో ఉన్న అసద్, ఆనమ్
  • ఇటీవలే నిశ్చితార్థం
  • త్వరలోనే పెళ్లి

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ అజహరుద్దీన్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జాల పెళ్లి త్వరలోనే జరగనుంది. వీళ్లిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. కొన్నిరోజుల క్రితమే అసద్, ఆనమ్ ల నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో డిసెంబరు 12న జరిగే వీరిద్దరి పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ సీఎం కేసీఆర్ ను మహ్మద్ అజహరుద్దీన్, అసద్, సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆహ్వానించారు. ఈ మేరకు సానియా సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.