Sachin Tendulkar: 14 ఏళ్ల క్రితం ఇదే రోజున గవాస్కర్ రికార్డును అధిగమించిన సచిన్

  • గవాస్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన సచిన్
  • టెస్టుల్లో 35వ సెంచరీ నమోదు
  • తన కెరీర్లో మొత్తం 100 సెంచరీలు సాధించిన సచిన్

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఈరోజు చాలా ప్రత్యేకమైనది. 14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును సచిన్ అధిగమించాడు. 2005 డిసెంబర్ 10న ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంకతో జరిగిన టెస్టులో సచిన్ 35వ సెంచరీని సాధించి... టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. అప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సచిన్ పేరిట ఉంది.

అంతర్జాతీయ కెరీర్లో సచిన్ 100 శతకాలను సాధించాడు. ఇందులో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో ఇప్పటికే 43 శతకాలను నమోదు చేశాడు. వన్డేల్లో సచిన్ రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి మరెంతో సమయం పట్టేలా లేదు.

  • Loading...

More Telugu News