rahul gandi: పౌరసత్వ సవరణ బిల్లును సమర్ధించడం అంటే దేశ పునాదులను ధ్వంసం చేయడమే: రాహుల్ గాంధీ

  • బిల్లు సమర్ధనను రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన రాహుల్
  • అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు
  • బుధవారం రాజ్యసభ ముందుకు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 ని సమర్ధించడం అంటే మన దేశ పునాదులను ధ్వంసం చేయడమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ బిల్లును సమర్ధించడం అంటే మన దేశ రాజ్యాంగంపై దాడి చేసినట్లుగానే భావించాలని మంగళవారం తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిని సమర్ధించిన వారు ఎవరైనా దేశ పునాదులను ధ్వంసం చేసినవారు అవుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తీవ్ర వాదోపవాదాలు, చర్చలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు పడ్డాయి. లోక్ సభను కుదిపేసిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో.

More Telugu News