MS Dhoni: సైనికుల జీవితాలపై ఎంఎస్ ధోనీ టీవీ షో!

  • సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ
  • సైనికులంటే అపార గౌరవం
  • త్వరలోనే షో ప్రసారం
టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీ త్వరలోనే ఓ టెలివిజన్ కార్యక్రమాన్ని రూపొందించనున్నాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీకి సైనికులంటే అపారమైన గౌరవం. అందుకే వరల్డ్ కప్ ముగియగానే జమ్మూకశ్మీర్ వంటి సంక్లిష్ట ప్రాంతంలో రెండు నెలల పాటు సైనిక విధులు నిర్వర్తించాడు. చాలాకాలం నుంచి సైన్యంతో ప్రస్థానం కొనసాగిస్తున్న ధోనీ తాజాగా సైనికుల జీవితాలు, వారి స్థితిగతులు, సమస్యలపై ఓ టెలివిజన్ షో నిర్మిస్తున్నాడు.

ఈ షో ద్వారా సైనికుల త్యాగాలు, దేశ భద్రత కోసం వారి శ్రమ ప్రజలందరికీ తెలియాలన్నదే ధోనీ ఉద్దేశం. సైనికులు, వారి కుటుంబ సభ్యుల వాస్తవిక జీవితాలు ఎలా ఉంటాయన్నది కూడా ధోనీ తన టీవీ షో ద్వారా వివరించనున్నాడు. ఓ జాతీయ స్థాయి చానల్ (స్టార్ ప్లస్ లేదా సోనీ టీవీ) లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
MS Dhoni
Army
Soldiers
TV Show
Jammu And Kashmir
India
Cricket

More Telugu News