sbi: ఎస్బీఐ పాత డెబిట్ కార్డుల మార్పిడికి ఈనెల 31 వరకే గడువు!

  • 2016 నుంచి చిప్ ఆధారిత కార్డుల జారీ
  • ఖాతాదారుల భద్రత కోసం ఆర్బీఐ సూచన
  • ఉచితంగా కొత్త కార్డులను జారీ చేస్తున్న బ్యాంకులు

దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల ఖాతాల భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత డెబిట్ కార్డుల జారీని మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికీ మ్యాగ్ స్ట్రైప్ ఆధారిత డెబిట్ కార్డులను వాడుతున్న తమ కస్టమర్లు, వాటిని ఈనెల 31లోగా ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులుగా మార్చుకోవాలని కోరింది. ఇందు కోసం ఖాతాదారులు తమ బ్రాంచిలలో సంప్రదించాలని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. జనవరి 1 నుంచి పాత కార్డుల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లుగా కూడా ఎస్బీఐ పేర్కొంది.

ఆర్థిక నేరగాళ్ల బారి నుంచి కస్టమర్లను కాపాడటానికి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా రిజర్వ్ బ్యాంక్ దేశీయ ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మ్యాగ్ స్ట్రైప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ప్రవేశ పెట్టింది ఆర్బీఐ. నాటి నుంచి అన్ని బ్యాంకులు తమ కొత్త ఖాతాదారులకు ఈ చిప్ తో కూడిన కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే అంతకు ముందు జారీ చేసిన కార్డులను వెనక్కు తీసుకుంటూ, ఉచితంగా కొత్త  కార్డుల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి బ్యాంకులు.

  • Loading...

More Telugu News