Anchor Ravi: యాంకర్ రవి కారుకు ప్రమాదం... ఘటనానంతర పరిణామాలు వీడియో చిత్రీకరణ!

  • కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి
  • వ్యాన్ డ్రైవర్ తాగి ఉన్నాడన్న రవి
బుల్లితెరపై స్టార్ స్టేటస్ సంపాదించుకున్న అతి కొద్దిమంది యాంకర్లలో రవి ఒకడు. పటాస్ షోతో రవి కెరీర్ పరంగా మంచి మైలేజ్ అందుకున్నాడు. కాగా, రవి కారుకు ప్రమాదం జరిగిన ఘటన ఆలస్యంగా వెల్లడైంది. హైదరాబాద్ లో మూసాపేట నుంచి బంజారాహిల్స్ వెళ్లే క్రమంలో రవి కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో రవి కారును డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే, ఈ ఘటన అనంతరం ప్రతి అంశాన్ని రవి వీడియోలో చిత్రీకరించాడు. వ్యాన్ డ్రైవర్ తో వాగ్వాదం, పోలీసులకు సమాచారం అందించడం, ఆ తర్వాత రవి పీఎస్ లో ఫిర్యాదు చేయడం ఇవన్నీ వీడియోలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి దెబ్బలు తగల్లేదు. రవి కారుకు డ్యామేజ్ అయింది. కాగా, రవి వీడియోలో మాట్లాడుతూ, ఆ వ్యాన్ డ్రైవర్ బాగా తాగి ఉన్నాడని వివరించారు.

Anchor Ravi
Hyderabad
Road Accident
Police
Driver

More Telugu News