praksam district: దాడులు చేస్తే బెదిరిపోయి పార్టీ మారిపోతానా?: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

  • ఇబ్బందులున్న మాట వాస్తవమే కానీ భయపడను
  • పార్టీ మారే అవసరం నాకేమాత్రం లేదు
  • బయట జరిగే ప్రచారంతో నాకు సంబంధం లేదు

పార్టీ మారుతారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, బయట జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీని వీడనున్నారన్న ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అందులో గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా వినిపించింది. 

దీనిపై ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'నా క్వారీలపై అధికారుల దాడులు, తనిఖీలతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అయితే ఇటువంటి బెదిరింపులకు నేను లొంగను. క్వారీ వ్యాపారం నాకు వారసత్వంగా వచ్చింది. 1990 నుంచి మా నాన్నగారు ఈ వ్యాపారంలో ఉన్నారు. అటువంటి వ్యాపారంపై దాడులు చేస్తే వదిలేస్తామని ఎలా అనుకుంటారు? అందువల్ల నా రాజకీయ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదు. నేను పార్టీ మారను. ఆ అవసరం కూడా నాకు లేదు' అంటూ స్పష్టం చేశారు.

praksam district
addanki
gottipati ravikumar
YSRCP

More Telugu News