DSC notification: వచ్చే నెలలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

  • అసెంబ్లీలో ప్రకటించిన ఏపీ విద్యాశాఖ మంత్రి
  • సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం
  • 7,900 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడి
నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో 7,900 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్త.
DSC notification
january 2020
education minister
AP assembly

More Telugu News