Nehru: నెహ్రూపై వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • భారత్ అత్యాచారాల రాజధానిగా మారిపోయిందని రాహుల్ వ్యాఖ్య
  • అతి పెద్ద రేపిస్ట్ నెహ్రూయేనన్న సాధ్వీ ప్రాచీ
  • రాహుల్ తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలన్న వీహెచ్‌పీ నేత
దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన సాధ్వీ.. నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాముడు, కృష్ణుడు నడయాడిన పుణ్యభూమి మన దేశమని, అలాంటి దేశంలో నెహ్రూ అతిపెద్ద రేపిస్ట్ అని, దేశ సంస్కృతిని నాశనం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. టెర్రరిజం, నక్సలిజం, అవినీతి, అత్యాచారాల వంటివన్నీ నెహ్రూ కుటుంబం ఇచ్చిన బహుమతులని వ్యాఖ్యానించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రాచీ డిమాండ్ చేశారు. ప్రాచీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nehru
sadhvi prachi
Rahul Gandhi
rapist

More Telugu News