Rashmi Goutham: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలకృష్ణ చిత్రంలో హాట్ యాంకర్ 
  • మురుగదాస్ తో రజనీ మరో సినిమా 
  • 'బిగ్ బాస్'కి మరోసారి ఎన్టీఆర్ 
  • వచ్చే నెల నుంచి వెంకటేశ్ కొత్త చిత్రం
   *  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి విదితమే. ఇందులో బాలయ్య సరసన ఓ నాయికగా టీవీ యాంకర్ రష్మిని తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది గ్లామర్ తో కూడిన ప్రత్యేక పాత్ర అని తెలుస్తోంది.  
*  తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రాన్ని చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనతో మరో సినిమా కూడా చేయనున్నాడు. 'దర్బార్' రజనీకి 167వ సినిమా కాగా, 168వ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక 169వ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తాడని కోలీవుడ్ సమాచారం.
*  బిగ్ బాస్ రియాలిటీ షోకి మరోసారి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ షో మొదటి సెషన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, రెండో సెషన్ కి నాని, మూడో సెషన్ కి నాగార్జున పనిచేశారు. ఇక నాలుగో సెషన్ కి ఏర్పాట్లు జరుగుతుండగా, దీనికి మళ్లీ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడని, ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
*  తాజాగా 'వెంకీమామ' చిత్రంలో నటించిన సీనియర్ నటుడు వెంకటేశ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. తమిళంలో హిట్టయిన 'అసుర' చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తాడు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి, నాలుగు నెలలలో ఇది పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.    
Rashmi Goutham
Balakrishna
Rajanikanth
Venkatesh

More Telugu News