cm: జగన్ ప్రభుత్వంలో సామాన్యులు బతకలేని పరిస్థితి: టీడీపీ నేత కొల్లు రవీంద్ర

  • దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది
  • బస్సు చార్జీలు పెంచారు
  • రేపు కరెంటు చార్జీలు కూడా పెంచుతారేమో
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని, దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. బస్సు చార్జీలు పెంచారని, రేపు కరెంటు చార్జీలు కూడా పెంచుతారేమో అంటూ మండిపడ్డారు.

ఉల్లి ధర వింటేనే ప్రజల కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. రైతు బజార్లలో సామాన్యులకు సరిపడా ఉల్లిపాయలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఉల్లి పాయల కోసం తొక్కిసలాడే పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన మరో నేత బోడె ప్రసాద్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు, మంత్రులను అచ్చోసిన ఆంబోతుల్లా గ్రామాలపై వదిలారని సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
cm
Jagan
Telugudesam
Kollu Ravindra

More Telugu News