శంషాబాద్ లో దిశ నివాసానికి వెళ్లిన పోలీసులు... దిశ తల్లిదండ్రులకు ఎన్ హెచ్ఆర్సీ పిలుపు

08-12-2019 Sun 15:34
  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • దర్యాప్తు చేస్తున్న ఎన్ హెచ్ఆర్సీ
  • దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ తీసుకోవాలని ఎన్ హెచ్ఆర్సీ నిర్ణయం
దేశంలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) సుమోటోగా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎన్ హెచ్ఆర్సీ బృందం దిశ నిందితుల మృతదేహాలను పరిశీలించడమే కాకుండా, దిశ అత్యాచార,హత్య ఘటన స్థలాలను కూడా పరిశీలించింది.

తాజాగా, ఎన్ హెచ్ఆర్సీ బృందం దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ రికార్డు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పోలీసులు శంషాబాద్ లోని దిశ నివాసానికి వెళ్లారు. వారు దిశ తల్లిదండ్రులను పోలీస్ అకాడమీకి తీసుకెళ్లనున్నారు. అక్కడ వారి స్టేట్ మెంట్ ను ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు రికార్డు చేస్తారు.