Sanju Samson: సొంతగడ్డపై సంజూ శాంసన్ కు అవకాశం దక్కేనా..?

  • నేడు విండీస్ తో భారత్ రెండో టి20 మ్యాచ్
  • వేదికగా నిలుస్తున్న తిరువనంతపురం
  • తొలిమ్యాచ్ లో బెంచ్ కే పరిమితమైన సంజూ
భారత క్రికెట్లో ఎంతో ప్రతిభావంతుడిగా పేరుగాంచిన కేరళ కుర్రాడు సంజూ శాంసన్ కు తగిన అవకాశాలు మాత్రం దక్కడంలేదు! టీమిండియాలో ప్రస్తుతం ప్రతిస్థానానికి విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో సంజూ తన చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టి20 సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికైన సంజూ తొలి మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే ఇవాళ జరిగే రెండో మ్యాచ్ కు సంజూ సొంత మైదానం తిరువనంతపురం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారైనా అతడికి తుదిజట్టులో స్థానం దొరుకుతుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో సంజూ శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మాట్ ఏదైనా కళాత్మక శైలికి దూకుడు ఆపాదించి నిలకడగా రాణిస్తున్నాడు. కొన్నివారాల కిందటే దేశవాళీ క్రికెట్లో ట్రిపుల్ బాది మాంచి ఊపుమీదున్న సంజూకి ఈ మ్యాచ్ లో అవకాశం దక్కుతుందని కేరళ క్రికెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Sanju Samson
India
West Indies
Cricket
Kerala

More Telugu News