Chandrababu: టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు రాజీనామా.. చంద్రబాబు, పవన్‌లపై తీవ్ర ఆరోపణలు

  • చంద్రబాబు మత రాజకీయాలకు వ్యతిరేకంగానే పార్టీకి రాజీనామా
  • అధికారం కోల్పోయాక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
  • పవన్‌కు పిచ్చి పట్టింది

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య బంధాలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయాక కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక దేవస్థానాల్లో క్రైస్తవులు పెరిగిపోయారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్‌బాబు అన్నారు. జనసేనాని పవన్‌కు పిచ్చి పట్టిందని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మరోసారి క్రైస్తవుల గురించి మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మత రాజకీయాలను వ్యతిరేకిస్తూనే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News