Zeero FIR telangana: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ షురూ

  • వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో తొలి కేసు
  • శాయంపేట యువతి అదృశ్యంపై ఫిర్యాదు
  • వెంటనే కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు

నేరాల కట్టడికి, నేరస్తులను వీలైనంత త్వరగా పట్టుకోవటానికి పోలీస్ శాఖ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తుంటుంది. అయితే కొన్నిసార్లు సంఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదంటూ కేసు నమోదు విషయంలో పోలీసులు తప్పించుకోవడంతో, కొన్ని నేరాల విషయంలో సత్వర చర్యలు తీసుకోవడం కష్టమవుతుంది. దీన్ని అరికట్టడానికి జీరో ఎఫ్ఐఆర్ (నేరం జరిగిన ప్రదేశం, పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయడం) పేరుతో ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

దిశ ఘటనలో పోలీసుల తాత్సారం కూడా కొంత ఉందనే విషయం వార్తలకెక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీరో ఎఫ్ఐఆర్ స్కీంను సీరియస్ గా తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఓ బాలుడి కిడ్నాప్ కు సంబంధించి 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నందిగామ సబ్ డివిజన్ లోని కంచికచర్ల పోలీస్ స్టేషన్లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో బాలుడి ఆచూకీని తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మిర్యాలగూడలో  కనుగొనడమే కాక, ఆ బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు.

ఇక తెలంగాణలో వరంగల్ సుబేదారి పోలీసులు శనివారం తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. వరంగల్ రూరల్  శాయంపేట మండలం గోవిందాపూర్ కు చెందిన 24 ఏళ్ల యువతి అదృశ్యంపై ఆమె చిన్నాన్న సుబేదారి పోలీసులకు కంప్లైంట్  ఇచ్చారు. దిశ ఘటనతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని శాయం పేట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

  • Loading...

More Telugu News