mamata didi: సరిగ్గా ఛత్రపతి శివాజీకి జరిగిన అవమానమే నాకూ జరిగింది!: పశ్చిమ బెంగాల్ గవర్నర్

  • ఛత్రపతి శివాజీకి జరిగిన అవమానంతో గవర్నర్ పోలిక
  • దీదీ ఇంట్లో పూజలో జగదీప్ ధన్ కర్ కు అవమానం
  • కాంక్లేవ్ ఈస్ట్ 2019 సదస్సులో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

గవర్నర్ గిరీపై చాలా కాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ చర్చ రచ్చలకు కూడా దారి తీస్తోంది. ప్రజాభీష్టం మేరకు అధికారం చేజిక్కించుకున్న తమపై కేంద్రం గవర్నర్ లను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయించాలని చూస్తుందనేది ప్రాంతీయ పార్టీల నాయకుల మాట.

ఇక విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఇంటికి పిలిచి మరీ అవమాన పరచారని, అయితే తాను ఔరంగజేబు రాజ్యంలో ఛత్రపతి శివాజీకి జరిగిన అవమానాన్ని తలుచుకుని మిన్నకుండిపోయానని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే ఈరోజు నిర్వహించిన కాంక్లేవ్ ఈస్ట్ 2019 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

గత దసరా సందర్భంగా అక్టోబర్ 11న దీదీ ఇంట్లో పెద్ద ఎత్తున దుర్గామాత పూజ జరిగింది. ఆ కార్యక్రమానికి దీదీ ఆహ్వానం మేరకు గవర్నర్ కూడా వెళ్లారు. అక్కడ ఆయనకు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వలేదట. పైగా ప్రభుత్వ మీడియా ద్వారా 4 గంటల పాటు టెలీకాస్ట్ అయిన ఆ కార్యక్రమంలో గవర్నర్ అయిన తనను 4 సెకన్లు కూడా చూపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఔరంగజేబు తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా 1666లో ఛత్రపతి శివాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. అయితే సభలో మాత్రం తన సైనికాధికారుల వెనుకనే శివాజీని నిలబెట్టి అవమానించాడు. ఈ విషయంలో శివాజీ అవమాన భారంతో రగిలిపోయారట.

More Telugu News