Mahesh Babu: సోమవారం మరొక పాట వస్తుంది చూడండి: మహేశ్ బాబు

  • మహేశ్ హీరోగా సరిలేరు నీకెవ్వరు చిత్రం
  • సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా
  • ఇప్పటికే ఓ పాట రిలీజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది. అయితే, ఈ చిత్రంలోని ఐదు పాటలను ఐదు సోమవారాలు విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. గత సోమవారం 'మైండ్ బ్లాక్' పాట రిలీజ్ అయింది. తాజాగా మరో సోమవారం రెండో పాట రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దీనిపై మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. "సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి తదుపరి పాట వస్తోంది. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే గీతం సోమవారం రిలీజవుతోంది" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా మహేశ్ పంచుకున్నారు.
Mahesh Babu
Tollywood
Rashmika
Anil Ravipudi
Songs

More Telugu News