women protection: మహిళల రక్షణ విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు

  • మహిళల రక్షణను ప్రధాన అంశంగా తీసుకోవాలి
  • 2 నెలల లోనే విచారణ పూర్తయ్యేలా చూడాలి
  • కేంద్రానికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు
దిశ దుర్ఘటన దేశాన్ని కుదిపేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళలపై దాడుల విషయంలో అన్ని రాష్ట్రాలనూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను తీవ్రంగా పరిగణించాలని, వీటి విషయంలో అలసత్వం వహించకుండా 2 నెలల వ్యవధి లోపే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. మహిళల రక్షణ అంశాన్ని రాష్ట్రాలు అత్యంత ప్రధాన  అంశంగా తీసుకోవడమే కాకుండా, ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 
women protection
central home ministry

More Telugu News