jharkhand Assembly Elections: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసుల కాల్పులు

  • ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఘటన
  • ఒక వ్యక్తికి గాయాలు
  • కొనసాగుతున్న రెండో దశ పోలింగ్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న రెండో దశ పోలింగ్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలోని 36వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు. దీంతో, భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై ఏడీజీపీ మీనా స్పందిస్తూ.. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారన్నారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని చెప్పారు.  
jharkhand Assembly Elections
firing at polling booth
A person injured

More Telugu News